3077 – ౧

March 25, 2010 at 5:47 pm (పండగ)

అది  రెండు వేల ఢెబ్బై ఏడవ సంవత్సరం(2077).. మహిళా స్వాతంత్ర్యం వచ్చి  కరెక్టుగా   100 సంవత్సరాలైంది. అబలలు ఉక్కుపాదంతో దేన్ని పడితే దాన్ని కదంతొక్కుతున్న రోజులవి. మహిళలు మగాళ్ళను మరమనుషులుగా మార్చి కుక్కపని చేయించుకునే రోజులవి. పెళ్ళి అయితే భర్తలు, భార్యల ఇంటి పేర్లను పెట్టుకుంటున్నారు. ఆడది అర్ధరాత్రులు కూడా దర్జాగా తిరుగుతున్నా, మగాడు మటుకు మధ్యాహ్నాలు కూడా తలెత్తుకుని తిరగలేకపోతున్నాడు. పురుషులకి చదువులెందుకని అసల స్కూల్లకి పంపటమే మానేసారు. స్కూల్లకే వెళ్ళని వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకని అవి ఇవటం లేదు.ఉద్యోగం లేనోళ్ళకి బైట పనేంటి అని బైటికి కూడా పంపటంలేదు. ఇంక చేసేదేమీలేక ఇళ్ళలో అబ్బాయిల నాన్నలు అబ్బయిలకి  బట్టలుతకటం, పిండి పిసకటం, అంట్లు తోమటం, కల్లాపు జల్లటం  లాంటివి  నేర్పిస్తూ టైం పాస్ చేస్కుంటున్నారు. ఎక్కడో ఒక్కర్నో ఇద్దర్నో  మినహాయిస్తే  మిగతా మగాల్ల పరిస్థితి అంతా ఇదే..

అసల అబలల లోకం ఎలా వుందంటే…

ఒక బడి లో 10వ తరగతి..

తెలుగు పీరియడ్ లో..
టీచర్ (ఆడదే) – అసలు మన కవయిత్రులు మగాల్లను పూలతో ఎందుకు పోలుస్తారు?
స్టూడెంట్స్ (ఆడాల్లే) – మగాల్లు మహిళల్లా మొరటుగా కాక, మెత్తగానూ, మృదువుగానూ, మైమరిపిస్తూ వుంటారు కాబట్టి  టీచర్.

సైంసు  పీరియడ్  లో..
టీచర్ – పిల్లలు న్యూటన్  సిద్దాంతాలు ఎవరు కనిపెట్టారు?
స్టూడెంట్స్  – న్యూటన్ వాళ్ళ ఆవిడ టీచర్.
టీచర్  – గుడ్. కరెక్ట్ ఆంసర్. మరి డాల్టన్ ఎటామిక్ థియరీ ని ఎవరు కనిపెట్టారు?
స్టూడెంట్స్ – డాల్టన్ వాళ్ళ ఆవిడ టీచర్.
టీచర్ – తప్పు. తప్పు. డాల్టన్ కి పెళ్ళి కాలేదు. పెళ్ళి కానియడల వాళ్ళ అక్కో లేక చెల్లో అని చెప్పలి. వాళ్ళు కూడా లేనియడల ….
స్టూడెంట్స్ – డాల్టన్ వాళ్ళ పక్కింటోళ్ళ ఆవిడ టీచర్.
టీచర్ – పర్ఫెక్ట్.
(ఈ విధంగా చరిత్ర లో మగాడు అనే వాడు కనిపిస్తే  చాలు దానికి ఆవిడ అనేది కలుపుకుంటూ పోతున్నారు.)

సోషల్  పీరియడ్ లో..
- మన లోక్ సభలో ఆడాల్ల సీట్లేన్ని? మగాల్ల సీట్లెన్ని?
- 544 ఆడ సీట్లు, ఒక్క మగ సీటు బోర్ కొట్టినప్పుడు నాలుగు జోకులేసుకుని టైం పాస్ చెయ్యటానికి .
- మన  రాజ్యాంగాన్ని  కొత్తగా తిరగ రాసింది ఎవరు?
- పొస్ట్  డా. ఆంబా దేవి (9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్  ఎంపిసి, బైపిసి, లండన్)

మాధ్స్ పీరియడ్ లో..
- పిల్లలు రెండొకట్లు ఎంతో చెప్పండి?
- రెండే టీచర్
- రైట్. మరి రెండు రెండ్లు?
(నిశబ్దం)
- రెండురెండ్లు  అంటే నాలుగు. చెప్పండి ఎంతో?
- నాలుగు టీచర్.
- మరి రెండు మూడ్లు?
(మళ్ళీ నిశబ్దం)
- రెండు మూడ్లు అంటే ఆరు. ఇప్పుడు చెప్పండి ఎంతో?
(నిశ్శబ్దం కంటిన్యూస్)
- అవును కష్టాలన్నీ ఆడాల్లకే. రెండు మూడ్లు  ఎంతో చూడకుండా చెప్పటం చాలా కష్టమని నాకూతెలుసు. రెండు రోజులు  ప్రాక్టీస్ చెయ్యండి. ‘ఆరు’ లో ‘ఆ’ అన్నా వస్తుంది. నేను అలా చేసినదానినే.
(నిశ్శబ్దం కంటిన్యూస్)

ఇలా మహిళల గొప్పతనాన్ని వర్నిస్తూ…….  ఒక వీక్లీలో  ఒక ఆర్టికల్ వచ్చింది…

పేజీ-1 ===
“ఎందరో మహిళలు, అందరికీ వందనములు”
—————————
1) సోనియా గాంధీ
- 2010 లో  33% వున్న  రిజర్వేషన్ ని, ఒక్కో సంవత్సరం ఒక్కోటి పెంచుకుంటూ పోతూ, 2077 నాటికి పూర్తిగా 100% రిజర్వేషన్ తో మహిళలా స్వాతంత్ర్యానికి పునాది వేసిన మహా మహిళ  ఎవరు ? ఓ మహిళ.
2) జయలలిత
- తన్ని, తన్నించుకున్న మహా మహిళ ఎవరు? ఓ మహిళ.
౩) విజయ శాంతి (of ఒసేయ్ రాములమ్మ  fame)
- అసల రిజర్వేషన్ కూడా వుందోలేదో తెలియని రోజుల్లోనే  తన ఊరి దొరపై దాడి చేసిన మహా మహిళ ఎవరు? ఓ మహిళ.
4) అనుష్క (of అరుంధతి  fame)
- దయా దాక్షిణ్యం లేకుండా  ఓ  దయ్యాన్ని సైతం  నేల కరిపించిన మహా మహిళ ఎవరు? ఓ మహిళ.
5) భూమిక (of అనసూయ fame)
- ఒక పాపని రక్షించటం కోసం తన ప్రాణాలనిసైతం లెక్క చెయ్యకుండా, డైరెక్టర్ విలన్ ని చంపేదాకా పోరాడిన మహా మహిళ ఎవరు? ఓ మహిళ.
6) ఛార్మి  (of అనుకోకుండా ఒక రోజు fame)
- తనకేంజరుగుతుందో తనకే తెలియని పరిస్థితుల్లో కూడా ఎదురీది సినిమాని క్లైమాక్స్ దాకా లాక్కొచ్చిన మహా మహిళ ఎవరు? ఓ మహిళ.

అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే గత 180 ఏళ్ళలో  మన మహిళలు ఎంత సాధించారో, ఇకపై ఎంత సాధిస్తారో కూడా ఇప్పుడే చెప్పేస్కోవచ్చు.
- ఓ మహిళ
—————————
పేజీ -2 ===
ఈ ఏడాది సినిమాల్లో కూడా  ఎప్పటిలాగానే ఆడాల్లదే పైచేయి.. అసల మన ఆడాల్లు నటించిన గత వందేల్ల  బంపర్ హిట్టు సినిమాల జాబితా చూస్తే..

1) క్వీన్య్ (కింగ్ )
2) మమ్మి (డాడి)
3) అది (అతడు)                   — 100రో     100 సెం(యాక్షన్, పిచ్చ రొమాంటిక్)              [ రో-రోజులు, సెం-సెంటర్లు, సం-సంవత్సరాలు]
4) వెంకమ్మ (వెంకి)
5) దళపత్ని  (దళపతి)
6) మల్లమ్మ (మల్లన్న)
7) ఒక్కర్తి   (ఒక్కడు)                   — 100రో    50 సెం (యాక్షన్, రొమాంటిక్)
8 ) అక్కయ్య (అన్నయ్య)
9) మృగరాణి (మృగరాజు)
10) నేను దేవతని (నేను దేవుడ్ని)                           — 360రో     150 సెం (యాక్షన్, డ్రామా)
11) చంటమ్మాయ్ (చంటబ్బాయ్)

12) విజయేంద్రవర్మ               — 2004 dec లో రిలీజయి 2005 jan లో ఆగింది. మళ్ళీ  2010 dec లో సెకెండ్  రిలీజయి ఇంకా ఆడుతూనే వుంది.   167 సం. 300 సెం. (వీర కామెడీ, పిచ్చ కామెడీ, అరుపు కామెడీ, కామెడీలకే కామెడీ)
13) నాన్న చెప్పాడు  (అమ్మ చెప్పింది)
14) ఏ మాయ చేసాడె (ఏ మాయ చేసావె)                       — 100రో    100 సెం  (పిచ్చ రొమాంటిక్ )
15) చుక్కల్లో చంద్రమ్మ (చుక్కల్లో చంద్రుడు)
16) కటకటాల రుద్రమ్మ (కటకటాల రుద్రయ్య)
17) పల్లకిలో పెళ్ళి కొడుకు (పల్లకిలో పెళ్ళి కూతురు)
18) ఒదినగారు బాగున్నారా (బావగారు బాగున్నారా)
19) సమర సింహా రెడ్డి వాళ్ళ ఆవిడ (సమర సింహా రెడ్డి)                — 720రో     100 సెం  (వీర యాక్షన్, వీర మాస్)
20) మగాల్ల మాటలకు మీనింగే లేదులే ..  (ఆడ వాళ్ళ మాటలకి అర్ధాలే వేరులే)    — 360రో    200 సెం (రొమాంటిక్ )

ఒక్క బాలకృష్ణ  గారి  అతి భయంకరమైన  కామెడీ  సినిమా “విజయేంద్రవర్మ” మెగా విజయం  తప్పితే మిగతావన్నీ మన ఆడవాల్లవే అని గర్విస్తున్నా. మన “రైసింగ్ సన్ ” రుద్రిణీ రెడ్డి(హీరోయిన్) గారు నటించిన “సమర సింహా రెడ్డి వాళ్ళ ఆవిడ” రెండు  సంవత్సరాలు  పూర్తి  చేస్కోటం చాలా ఆనందంగా వుంది. ఇక మన “సూపర్ సన్” సుందరీ  శెట్టి గారు నటించిన  ఫామిలీ  రొమాంటిక్ సినిమా “మగాల్ల మాటలకు మీనింగే లేదులే ..” అటు  ఆడాల్లను, ఇటు మగాల్లను,  ఇద్దర్నీ మెప్పించి, 360రో    200సెం  తో దూసుకెళ్తుంది.
- ఓ మహిళ
————————-

రోజురోజుకీ వ్యసనపరుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇప్పుటి బట్టలు కొనడం ఒకప్పటి మందుకొట్టడం లా, ఇప్పుటి బంగారం కొనడం ఒకప్పటి సిగిరెట్టు తాగటంలా తయారయ్యాయి. వీధికి  రెండు బట్టలకొట్టులు, మూడు బంగారపు కొట్టులు వెలిసాయి. ఎంతో మంది ఆడవాల్లు ఈ రెండు వ్యసనాలకి బానిసలై భర్తా పిల్లల్ని రోడ్డుపాలు చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఆపాలంటే ప్రధాన మంత్రి కుమారీ గంగా గాంధీ ఏదో ఒక చర్య తప్పని సరిగా తీస్కోవాలి. ఆల్రెడీ మన రాష్ట్ర ముఖ్య మంత్రి  జగన్ మోహినీ రెడ్డి  PM గంగా గాంధీ కి  ఈ వ్యసనాలను తెలియజేస్తూ  ఒక ఉత్తరం  వ్రాయటం జరిగింది. ఆ ఉత్తరంలో మన రాష్ట్రం లోని  బట్టల బానిసల గురించి, బంగారు బానిసల గురించి , వారి వారి కుటుంబాల గురించి తీవ్ర స్థాయిలో వ్రాశారు. బట్టల, బంగారు దుకాణాలను మూయించే ప్రతిపాదన చేసారు. వాటి ద్వారానే లంచాలు వస్తయ్ కాబట్టి మిగతా మంత్రులందరూ సమ్మతించలేదు.

ముఖ్య మంత్రి  జగన్ మోహినీ రెడ్డి  గారు ఈ వ్యసనపరులను ఉద్దేశిస్తూ   అసెంబ్లీ లో …
” ఏ ! ఇరవై చీరలు చాలవా? రెండొందలు కావాలా? ఏ! రెండు బంగారు చైనులు చాలవా? ఇరవై కావాలా? ఎందుకండీ వీటికి బానిసలై  భర్తల్ని, పిల్లల్ని రోడ్లపాలు చేస్తారు.”

ఇలా ఎంత వాదించినా వినకపోటంతో సహా, ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని ఫిక్స్ అయ్యారు పార్టీ ప్రతినిధులు. ఇక చేసేదేమీలేక బాగా తప్ప తాగి   అయిదు మంది అమ్మాయిలతో కలిసి ఒకబ్బాయిని చెరిచిన మంత్రిగారి అమ్మాయిని చంపేయించి, తాను కూడా  రాజీనామా చేసేసి పాద యాత్ర మొదలెడుతుంది.

మగాల్లను కాపాడాలంటే ఈ ఒక్క  లీడర్ జగన్ మోహినీ రెడ్డి గారు సరిపోరు అని, ఒక ఉక్కుపాదం వున్న మగాడు కూడా పుట్టాలని మగాల్లంతా కోరుకుంటుండగా….

PS1: మరో మరో చరిత్ర పేద్ద రాడ్ అంట. డివిడి వచ్చినా చూడద్దని హెచ్చరితున్నారు.

PS2: ఏదో సరదాకి మతి చెడి టైం పాస్ కి రాస్కున్నది. ఎవరూ తప్పుగా అనుకోరాదు.

PS3: వరుడు కోసం వెయిటింగ్.

PS4: nbh లో ఈ రోజు వుంది నాయనా ఫుడ్డూ,,, అబ్బో మీరేజన్మలో కూడా తినుండరు. అంత ఛెండాలంగా వుంది.

Advertisement

16 Comments

  1. PraV said,

    rey neelo pedda rayadu lo mohan babu laaga inta bayankaramaina feminist unnadaaa !! ;)

    ii script tho jamba lakidi pamba-2 teesamante, abboo adanamata… cinema perlu adaragottav..nenu inkoti add chesta

    21) narasimhanaidu valla mummy

    setu lo join ayaka kuda ilanti post lu raase time undi ante idedo alochinchalsina vishayamee :)

  2. RAM said,

    :) uuu male chauvinist :P .. nice satire on the women reservation btw :)

    @ jaganmohini reddy aka leader fame : :) :) :)

  3. redrod said,

    బాబోయ్! అదేం లేదు రా బాబు. దేనిమీద రాయలో ఆలొచిస్తున్న సమయం లో మన ప్రియతమ ప్రభుత్వం మొన్న ప్రవెశపెట్టిన 33% రిజర్వేషన్ గుర్తొచ్చి అలా ప్రొసీడయ్యాను అంతే. అంతకు మించి ఏమియును లేదు.

  4. nagarjuna said,

    parts parts gaa baavundi mama…
    overall gaa tega navvinchesindi…
    nee trade mark vetakaaram adirindi…

  5. గోపాల్ said,

    “ఏ ! ఇరవై చీరలు చాలవా? రెండొందలు కావాలా? ఏ! రెండు బంగారు చైనులు చాలవా? ఇరవై కావాలా? ఎందుకండీ వీటికి బానిసలై భర్తల్ని, పిల్లల్ని రోడ్లపాలు చేస్తారు” – ఇది చాలా నచ్చిందిరా! :)

  6. sudheer said,

    entra..CM vishyamlo extralu chesav….CM kachitanga purandareswaridevi ne

    rey naa fav mov..samarasimhareddy ne kooda kooni chesav kadara!

  7. Naagas said,

    “స్టూడెంట్స్ – డాల్టన్ వాళ్ళ పక్కింటోళ్ళ ఆవిడ టీచర్.” హిహి.. కుమ్మింది.
    మగాల్ల మాటలకు మీనింగే లేదులే, నాన్న చెప్పాడు .. అదుర్స్ :)

    నీకు ఇంకా బోలెడు సార్లు మతి చెడిపోయి, ఇలాంటివి బోలెడు రాయాలని కోరుకుంటున్నాం.

    చివరగా చిన్న సలహా: “ఎవరూ తప్పుగా అనుకోరాదు.” ఈ లైన్ మొదట్లో పెట్టు, ఎందుకైనా మంచిది! :P

  8. Rohit said,

    vijayendra varma ki respect ichav choodu.. adi maa balayya goppatanam.. aada maga teda lekunda evarikaina nache cinema adi..

    naa vaipu nundo oo cinema…

    indra– indraani
    okka magadu — okka aadadi..

    inka nee post.. abbo.. ee post sonia gandhi garu chadivite.. enduku ichama reservation anukunela rasav ;) kummei…

  9. Sundeep said,

    kevvu keka… gora maina creativity kada :P …EVV ee blog chosado jamba lakadi bamba part 2 :D

  10. Vam said,

    lolo lol @ రెండు మూడ్లు ఎంతో చూడకుండా చెప్పటం చాలా కష్టమని నాకూతెలుసు. రెండు రోజులు ప్రాక్టీస్ చెయ్యండి. ‘ఆరు’ లో ‘ఆ’ అన్నా వస్తుంది. నేను అలా చేసినదానినే.

  11. shashank said,

    Keka ra…
    Munna —-> Munni

  12. rag said,

    redrod back with a bang!!!…very nice raa vibbu

  13. Amused Observer said,

    న్యూటన్ కూడా ఆజన్మబ్రహ్మచారి.

    • redrod said,

      వికి లో చూసా. దాని గురించి లేదు. ఇంక లాగించా. సరేలే, న్యూటన్ కి పెళ్ళి కాలేదని ఆ టీచర్ కే తెలిదు అనుకుందాం ఈ ఒక్క సారికి ;)

  14. vg said,

    kummavu … ! inka ilanti postlu chala rayali …

    last lo .. magallu .. maaku 33% reservation kavali ani poratam modelattaru ani cheppi muginchi unte bagundedi :)

    • redrod said,

      maastaaru taruvaathi bhaagam ade.. anduke alaa muginchatam jarigindi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.